HomeLaw and Orderసిఫారస్ లకే పెద్దపీట ...... పోస్టింగ్ ల్లోఫలించిన ఒత్తిళ్లు ......చక్రం తిప్పిన మీడియా ప్రతినిధి .....ఒకే...

సిఫారస్ లకే పెద్దపీట …… పోస్టింగ్ ల్లోఫలించిన ఒత్తిళ్లు ……చక్రం తిప్పిన మీడియా ప్రతినిధి …..ఒకే సామజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారనే అపవాదు……పదోన్నతులు పొందిన వారికి దక్కని లా అండ్ ఆర్డర్ …….

దాదాపు యేడాదిన్నర తర్వాత ఎడతెగని కసరత్తులు చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు డిఎస్పీ ల బదిలీలు చేసింది. రేవంత్ సర్కార్ పోలీసు శాఖ బదిలీ ల్లో ముఖ్యంగా ఐపిఎస్ ల పోస్టింగ్ ల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యే ల ఒత్తిళ్ల ను పట్టించుకోలేదు మెరిట్ ఆధారంగా అదికూడా డైరెక్ట్ ఐపిఎస్ లకే అవకాశం ఇచ్చింది.

కానీ డీఎస్పీ ల విషయంలో చేతులెత్తేసింది. సిఫారస్ లకే మొగ్గు చూపింది. మెరిట్ ను పక్కకు పెట్టిసి ఎమ్మెల్యే మంత్రులఒత్తిళ్ల తో పాటు ఢిల్లీ స్థాయిలోనూ లాబీయింగ్ జరిగిందనే ప్రచారం జరిగింది.

ఇద్దరు ఏసీపీ ల పోస్టింగ్ ల్లో టీవీ మీడియా ప్రతినిధి సైతం చక్రం తిప్పారని చర్చ జరుగుతుంది. 72 మంది డిస్పీ లకు బదిలీలు జరిగాయి.

తీవ్రమైన ఆరోపణలున్న వారిని కదిలించలేదు.యేడాది క్రితం పదోన్నతులు పొందిన వారిలో అనేక మందికి కనీస ప్రాధాన్యత లేని పోస్టింగ్ లు ఇవ్వడం చర్చ నియాంశం అయింది.

ఉన్నస్థాయిలో పైరవీ చేసిన ఒకరిద్దరికి వరసగా రెండో పోస్టింగ్ ఇచ్చింది.ఓకె సామజిక వర్గం కు చెందిన అధికారులకు అత్యంత కీలక స్థానాల్లో పోస్టింగ్ దక్కడం సీనియర్ అధికారులకు మింగుడు పడడం లేదు.

బాన్స్ వాడ… మహంకాళి పోస్టింగ్ ల్లో ఉన్నవారికి కనీసం యేడాది పదవి కాలం పూర్తీ చేయకుండానే బదిలీ చేసారు. నిజానికి ఏసీబీ సైతం వేటాడుతున్న అరడజన్ మంది అధికారులను ప్రభుత్వం కదిలించలేక పోయింది.

ముఖ్యంగా హైదారాబాద్ లోని మూడు కమిషనరేట్ పరిధి లో దాదాపు 12 కీలక పోస్టింగ్ లు ఓకె సామజిక వర్గం అధికారులకే దక్కడం పోలీస్ శాఖ లో హాట్ టాపిక్ గా మారింది.

లా అండ్ ఆర్డర్ లో ఉన్న అధికారులకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేశారు.

తూప్రాన్ లో డిస్పీ కి మాత్రం సైదాబాద్ ఏసీపీ గా పోస్టింగ్ దక్కింది. కీలక మైన హెచ్ యం డి లో ఉన్న జానికి రెడ్డి కి మహేశ్వరం ఏసిపి గా నియామకం అయ్యారు.

ఆయన మొన్నటి దాక ఎల్ బి నగర్ లో పనిచేసి వెళ్లారు కొద్దీ నెలల గడువులోనే కీలక మైన మహేశ్వరం ఏసిపి గా పోస్టింగ్ ఇచ్చారు.

మహంకాళి ఏసీపీ గా యేడాది క్రితమే నియామకం అయినా సర్దార్ సింగ్ ఆరోపణలనేపథ్యంలో బదిలీ చేసి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.

ఎలాంటి ఆరోపణలు లేని బాన్స్ వాడ డిస్పీ సత్యనారాయణ ను కేవలం ఎమ్మెల్యే పోచారం ఒత్తిడి మేరకు యేడాది లోపే బదిలీ చేశారు.

ఆయన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సిఫారస్ తో పోస్టింగ్ దక్కింది. అదే కారణంతో పోచారం వెంటబడి మరీ కదిలించారని ప్రచారం జరుగుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments