HomePOLITICAL NEWSArmoorఅంకాపూర్ 8 ఏండ్ల చిన్నారి రవీంద్రభారతిలో అద్భుత ప్రదర్శన..-ఆరు రోజుల్లోనే నాట్యాన్ని నేర్చుకొని.. తొలి ప్రయత్నంలోనే...

అంకాపూర్ 8 ఏండ్ల చిన్నారి రవీంద్రభారతిలో అద్భుత ప్రదర్శన..-ఆరు రోజుల్లోనే నాట్యాన్ని నేర్చుకొని.. తొలి ప్రయత్నంలోనే అబ్బురపరిచిన జయ రెడ్డి..

నృత్య ప్రదర్శన..-ఆర్మూర్ ప్రాంతంలో చిన్నారి జయ రెడ్డికి పలువురు ప్రముఖుల అభినందనలు..

ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం ఆదర్శ గ్రామమైన అంకాపూర్ గ్రామానికి చెందిన 8 ఏళ్ల చిన్నారి పైడి జయారెడ్డి హైదరాబాదులోని రవీంద్ర భారతిలో నాట్య ప్రదర్శన చేసి అందరిని అబ్బురపరిచింది.

కేవలం నాట్యాన్ని 6 రోజుల్లోనే నేర్చుకొని తొలి ప్రయత్నం లోనే రవీంద్ర భారతి లో ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలో అందరి మండలాలను అందుకొని జయ రెడ్డి శభాష్ అనిపించుకుంది. కేవలం ఎనిమిదేళ్ల చిన్నారి చిచ్చరపిడుగు వలె ఆరు రోజుల్లోనే నాట్యాన్ని నేర్చుకొని రాష్ట్రంలో అద్భుత కళావేదికైన రవీంద్రభారతి వేదికగా అద్భుతంగా నృత్య ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకుంది.

ఈ చిన్నారి పైడి జయరెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి.. తనయ, ఆర్ఆర్ ఫౌండేషన్ డైరెక్టర్ పైడి సుచరిత రెడ్డి ఏకైక కూతురు. ఈ చిన్నారి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్వయాన మనవరాలు అవుతుంది.

ఈ చిన్నారి రవీంద్రభారతిలో నృత్య ప్రదర్శనలో అద్భుత ప్రదర్శన కనబరిచి పలు మెమొంటోళను తొలి ప్రయత్నం లోనే అందుకోవడంతో ఆర్మూర్ ప్రాంతంలోని పలు రంగాల్లోని ప్రముఖులు ప్రత్యేకంగా పలు సోషల్ మీడియా విభాగాల్లో అభినందనలు వెల్లువలా తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments