నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో బుధవారం ఉదయం పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. గ్రామంలోకి ప్రవేశించిన ఒక పిచ్చికుక్క మారణతాండవం నిర్వహించి మొత్తం 14 మందిపై దాడి చేసి గాయపరిచింది.
గాయపడిన వారిని వెంటనే ధర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అందులో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మౌనిక తెలిపారు.
