పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ఈనెల చివరిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పేర్కొన్నారు.
బుదవారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో కిసాన్ మోర్చ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి పాల్గొని మాట్లాడారు.
నిజామాబాద్ పసుపు రైతులకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం మేరకు పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా పసుపు బోర్డుకు జాతీయ చైర్మన్ ని కూడా మన నిజామాబాద్ జిల్లా రైతు కుటుంబానికి చెందిన పల్లె గంగారెడ్డి ని చైర్మన్ గా నియమించడం జరిగిందనీ అన్నారు.
అంతేకాకుండా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని కూడా మన నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేశారని తెలిపారు. నిజామాబాద్ జిల్లా రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పసుపు బోర్డు కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొని మన నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు ఏర్పాటుచేసి, కేంద్ర కార్యాలయాన్ని కూడా నిజామాబాద్ జిల్లాలో కేటాయించేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి అమిత్ షాకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపేందుకు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభానికి రానున్న అమిత్ షా..పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ఈనెల చివరిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పేర్కొన్నారు.