HomeLaw and Order2,38,247 మంది రైతుల ఖాతాలలో రూ. 214.56 కోట్ల రైతు భరోసా నిధులు జమ ...

2,38,247 మంది రైతుల ఖాతాలలో రూ. 214.56 కోట్ల రైతు భరోసా నిధులు జమ కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు జిల్లాలోని 2,38,247 మంది రైతుల ఖాతాలలో రూ. 214.56 కోట్ల నిధులు జమ అయ్యాయని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.

వానాకాలం – 2025 సీజన్ కు సంబందించి పంట పెట్టుబడి సాయం క్రింద ప్రభుత్వం జిల్లాలో మొత్తం 2,98,472 మంది రైతులకు రూ. 326.03 కోట్ల నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తోందని అన్నారు.

ఈ నెల 16వ తేదీన రెండు ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన జిల్లాలోని 1,681,66 మంది రైతుల ఖాతాలలో ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున రూ. 95.66 కోట్ల పంట పెట్టుబడి సాయం నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేసిందని తెలిపారు.

17వ తేదీన మూడెకరాల వరకు సాగు భూమి ఉన్న 44,006 మంది రైతుల ఖాతాలలో రూ. 65.06 కోట్ల నిధులు, 18, 19వ తేదీలలో ఐదెకరాల లోపు సాగు భూమి కలిగిన 26,075 మంది రైతుల ఖాతాలలో రూ. 53.84 కోట్ల నిధులు జమ చేసిందని వివరించారు.

నాలుగు రోజుల వ్యవధిలోనే మొత్తంగా జిల్లాలో 2,38,472 మంది రైతుల ఖాతాలలో రూ. 214 కోట్ల నిధులు జమ అయ్యాయని జిల్లా పాలనాధికారి వివరించారు. రైతులు కొత్త పాస్ బుక్కులు(05.06.2025 రోజు వరకు) వచ్చిన వారు వ్యవసాయ విస్తీర్ణాధికారులను కలసి సరైన పత్రాలను సమర్పించాలని అన్నారు.

వాడుకలో ఉన్న బ్యాంకు అకౌంట్ నెంబర్లను అందించాలని కలెక్టర్ సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments