HomeTelanganaNizamabadషాదీ ముబారక్ చెక్కుల పంపిణీ వేగవంతం చేయండి బ్యారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాలపై నిజామాబాద్‌ AIMIM...

షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ వేగవంతం చేయండి బ్యారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాలపై నిజామాబాద్‌ AIMIM ప్రతినిధుల వినతి

హైదరాబాద్ ఎంపీ మరియు AIMIM అధ్యక్షుడు బ్యారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ సాహెబ్ హిదాయత్ మేరకు, నిజామాబాద్ AIMIM యూనిట్ ప్రతినిధులు షాదీ ముబారక్ స్కీమ్‌కు సంబంధించి RDO రాజేంద్ర కుమార్‌ను కలిసి చెక్కుల పంపిణీపై వినతిని తెలియజేశారు.

ఈ సందర్భంగా పార్టీ టౌన్ అధ్యక్షుడు షకీల్ అహ్మద్ ఫాజిల్, జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఫయాజుద్దీన్ మాట్లాడుతూ— దక్షిణ, ఉత్తర MRO కార్యాలయాల్లో షాదీ ముబారక్ చెక్కులు తయారై పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పంపిణీలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు.

దీంతో పేద ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పంపిణీ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు సౌకర్యం కల్పించాలని వారు లిఖితపూర్వకంగా RDOకు వినతిపత్రం అందించారు.

AIMIM ప్రతినిధుల విజ్ఞప్తిపై స్పందించిన RDO రాజేంద్ర కుమార్, దక్షిణ, ఉత్తర MROలకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఇన్‌షా అల్లాహ్, త్వ‌రలోనే షాదీ ముబారక్ స్కీమ్ చెక్కులు అర్హులైన పేద కుటుంబాలకు పంపిణీ చేయనున్నట్లు పార్టీ ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో AIMIM టౌన్ జాయింట్ సెక్రటరీ ఐజాజ్ హుస్సేన్, మాజీ కార్పొరేటర్లు మహ్మద్ రియాజ్ అహ్మద్, అబ్దుల్ గఫూర్ ముకీం, అబ్దుల్ అలీ, మహ్మద్ ముస్తహ్సిన్, ఖలీల్ అహ్మద్, అర్షద్ పాషా, అజీజ్ రాహీ, అమర్ ఫారూక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments