HomeEditorial Specialప్రభుత్వ స్థలం లో పార్కింగ్ దందా......డీఈవో ఆఫీస్ జాగా లో అంబులెన్స్ అడ్డా

ప్రభుత్వ స్థలం లో పార్కింగ్ దందా……డీఈవో ఆఫీస్ జాగా లో అంబులెన్స్ అడ్డా

కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఇప్పడు పార్కింగ్ దందాగా మారింది. అదికూడా నగర నడిబొడ్డున! నిజామాబాద్ పట్టణంలోని పాత డీఈఓ కార్యాలయంఉన్న ప్రభుత్వ భూమి ప్రస్తుతం ‘పార్కింగ్ దందా’కు కేంద్రంగా మారింది.

విలువైన ఈ ప్రభుత్వ భూమి ఇప్పడు పార్కింగ్ కు అడ్డాగా మారింది. స్థానికంగా ఓ ఆసుపత్రి లో పనిచేసే ఓ వ్యక్తే ఈ భూమి విషయంలో పెత్తనం సాగిస్తున్నారు. అందుకు అధికార పార్టీకి చెందిన ఓ చోట నేత అండ ఉందంటూ బుకాయిస్తున్నారు.

మొదట ప్రైవేట్ అంబులెన్స్ లను మాత్రమే పార్కింగ్ చేసినా ఇప్పడు ఆయా ఆసుపత్రుల యజమానులైన డాక్టర్ల వాహనాలను సైతం ఇక్కడే పార్కింగ్ చేస్తున్నారు. ఏ చిన్న అనారోగ్యంతో ఆసుపత్రి ల్లో చేరిన రోగుల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారు కానీ ఏ ఒక్క ఆసుపత్రికి పార్కింగ్ సదుపాయం మాత్రం లేదు. .

గతంలో ఇక్కడ జిల్లా విద్యాశాఖ కార్యాలయం వుండేది. కానీ భవనాలు శిథిలం కావడంతో ఈ మద్యే పూర్తిగా కొత్త కలెక్టర్ కార్యాలయం ఆవరణలోకి మార్చారు.విశాలమైన ఈ భూమిని తమ సంస్థ అవసరాల కోసం కేటాయించాలని బలభవన్ గ్రంథాలయ సంస్థ సహకార శాఖ న్యాయ శాఖలు అర్జీ లు పెట్టుకున్నాయి.

పాత భవనాన్ని గ్రంథాలయంగా మార్చి, పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా ఏర్పాటు చేశారు. రోజూ డజనల కొద్దీ విద్యార్థులు మౌనంగా చదువుకునే ప్రదేశం ఇప్పుడు అంబులెన్సుల హోర్నులతో హడావిడిగా మారింది.

చదువుకునే వాతావరణం కలుగక విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కానీ ఈ మద్యే గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా నియామకం అయినా రాజిరెడ్డి ఇందుకోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు..

పిచ్చి మొక్కల తో నిరుపయోగంగా మరీనా ఈ ప్రాంతంను జెసిబి ,ట్రక్టర్ల తో చదును చేయించి వాడకం లోకి తెచ్చారు ఎలాగో పోటీ పరీక్షల కారణంగా గ్రంథాలయంకు వచ్చే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది.ఇప్పుడున్న భవనం కూడా ఇరుకుగా మారింది.

కానీ ఈ భూమి ని ఎవరికీ కేటాయించాలనే విషయంలో అధికారులు ఇంకా ఓ అంచనాకు రాలేక పోతున్నారు. ఇదే అదనుగా పార్కింగ్ దందా కు తెరలేపారు పేరుతో జరుగుతున్న ఈ అక్రమ దందా వెనుక ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకుడే కీలకంగా ఉన్నాడు ? వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నరు మొదట అంబులెన్స్ ల పార్కింగ్ చేసిన ఇప్పడు ప్రైవేట్ వాహనాలను సైతం ఇందులో పార్కింగ్ చేయడానికి అనుమతి ఇస్తున్నారు.

పాత అటవీ శాఖ కార్యాలయం వద్ద ఇప్పటికే ప్రైవేట్ అంబులెన్స్ ల ను నిలపడానికి అనుమతి ఉంది.ఇప్పుడు పాత డీఈవో ఆఫీస్ ను సైతం అడ్డాగా మార్చడం వెనుక అధికారుల ఉదాసీనత ఉంది.

రోగులకు తరలించే విషయంలో నయా పైసా తగ్గని ప్రైవేట్ అంబులెన్స్ ఓనర్లు ప్రభుత్వ భూమి లో పాగా వేయడం ఫై విమర్శలు వెక్కువెత్తుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments