పాఠశాలలు పునర్ ప్రారంభం కావడంతో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ స్కూల్ బస్సులపై కొరడా ఝళిపిస్తున్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్య నగర్ చౌరస్తా లో ప్రైవేట్ స్కూల్ బస్సులపై మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాహుల్,కిరణ్ ల ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.అలాగే పలు పాఠశాలల బస్సులను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిబంధనలు పాటించకుండా ప్రైవేట్ స్కూల్ బస్సులను రోడ్లపై తిప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ప్రైవేట్ స్కూల్ బస్సుకు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అనుభవజ్ఞులైన డ్రైవర్ తో పాటు క్లీనర్ తప్పకుండా ఉండాలని సూచించారు.
ఇందులో ఏ ఒక్కటి తగ్గిన కేసులు తప్పవన్నారు.అలాగే 15 సంవత్సరాలు దాటిన బస్సులు రోడెక్కితే విద్యాసంస్థ పైన కేసులు నమోదు చేశామని హెచ్చరించారు.
మూడూ గూడ్స్ వాహనాలు సీజ్.. స్కూల్ బస్సులు తనిఖీ చేసే సమయంలో ఫిట్నెస్, ట్యాక్స్ లేని మూడు ఎల్ జివి గూడ్స్ వాహనాలను పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు.
