HomeCRIMEవరకట్న కోసం వేధింపులు ఆత్మహత్య ......నిందితుడి కి పదేళ్ల జైలు శిక్ష ......జిల్లా కోర్ట్ సంచలన...

వరకట్న కోసం వేధింపులు ఆత్మహత్య ……నిందితుడి కి పదేళ్ల జైలు శిక్ష ……జిల్లా కోర్ట్ సంచలన తీర్పు

వరకట్నం కోసం వేధించడంతో మహిళా ఆత్మ హత్య కు పాల్పడిన ఘటన లో భర్త కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తు జిల్లా కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జివి భారత లక్ష్మి తీర్పు చెప్పారు. డిచ్ పల్లి కి చెందిన ఫౌజియా బేగం 2 సంవత్సరాల క్రితం షేక్ ఇద్రిస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

పెళ్లి సమయంలో రూ.1.50 లక్షల నగదు, 10 తులాల బంగారం, ఒక బైక్ మరియు ఇతర వస్తువులు కట్నంగా ఇచ్చారు. కానీ పెళ్లి అయిన 3 నెలల తర్వాత భర్త మరియు అతని కుటుంబ సభ్యులు అదనంగా డబ్బు తీసుకొని రావాలని మానసికంగా మరియు శారీరకంగా వేధించేవారు.

భర్త షేక్ ఇద్రిస్‌తో పాటు అతని సోదరుడు షేక్ అలీ కూడా వేధింపులకు పాల్పడ్డారు. సంతానముకాక పోవడంతో మరిన్ని వేధింపులుచేశారు . ఇరు కుటుంబాల పెద్దలు సర్ది చెప్పిన మార్పు రాలేదు.2021అక్టోబర్ 15 న సాయంత్రం 5 గంటల సమయంలో, ఫౌజియా ఆత్మహత్యకు పాల్పడింది .

ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఆమె మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. మృతురాలి తమ్ముడు షేక్ గులాం గౌస్ డిచ్ పల్లి పోలీసులకు పిర్యాదు చేసారు అత్తింటి వేధింపుల వల్లే ఆత్మ హత్య కు పాల్పడినట్లుగా పేర్కొన్నారు.

భర్త మీద వేధింపుల అభియోగాలు రుజువు కావడంతో భర్త ఇద్రీస్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తు తీర్పు ఖరారు చేసారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments