Thursday, April 16, 2026
HomePOLITICAL NEWSArmoorఇసుక వాహనాల సీజ్ - బడా భీంగల్, చెంగల్ లో వాహనాల తనిఖీ- వ్యవసాయేతర...

ఇసుక వాహనాల సీజ్ – బడా భీంగల్, చెంగల్ లో వాహనాల తనిఖీ- వ్యవసాయేతర పనులకు ట్రాక్టర్లు వాడవద్దు – ఆర్మూర్ మోటర్ వాహన ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి

ఆర్మూర్: ఓవర్ లోడ్ తో అక్రమంగా ఇసుకను తరలిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ట్రాక్టర్లను ఆర్మూర్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ గుర్రం వివేకానంద రెడ్డి సీజ్ చేశారు.

భీంగల్ మండల కేంద్రం తో పాటు బడా భీంగల్, చేంగల్ గ్రామాలకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా అతివేగంతో ఓవర్ లోడ్ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను ఆయన తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని నాలుగు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మోటార్ వాహన ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ…

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. వ్యవసాయ అవసరాల కోసం తీసుకున్న ట్రాక్టర్ వాహనాలను కమర్షియల్ అవసరాల కోసం వాడవద్దని హెచ్చరించారు.

లైసెన్సు లేకుండా వాహనాలను మైనర్లతో నడిపించవద్దని, ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!