Thursday, April 16, 2026
HomePOLITICAL NEWSArmoorకరెంటు షాక్ తో వ్యవసాయ కూలి మృతి

కరెంటు షాక్ తో వ్యవసాయ కూలి మృతి

ఆర్మూర్ ఇది సంగతి :

వ్యవసాయ పనుల నిమిత్తం కరెంటు మోటార్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు గౌలి యాదవ్ అని వ్యవసాయకురి కూలి మృతి చెందాడు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం లింబాపూర్ గ్రామానికి చెందిన గౌలె యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి గత నాలుగున్నర సంవత్సరాల క్రితం బ్రతుకుదెరువు కోసం వేంపల్లి గ్రామనికి వచ్చినాడు.

వేంపల్లి గ్రామానికి చెందిన జక్క గంగాధర్ దగ్గర గత నెల రోజుల నుండి వ్యవసాయ పనులకు వెళ్తున్నాడు. రోజు మాదిరిగానే వ్యవసాయ పనులకు వెళ్లి మోటార్ కరెంటు డబ్బా లో వైరు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలింది.

వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అక్కడ డ్యూటీ డాక్టర్ పరిశీలించి కరెంటు షాక్ తో మృతి చెందాడని తెలిసింది మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముప్కాల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!