ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ తెలిపారు.
ఆదివారం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి,షాది ముభారక్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీసీసీ మహేష్ కుమార్ గౌడ్,షబ్బీర్ అలీ, ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. అర్బన్ నియోజకవర్గంకు చెందిన మొత్తం 575 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముభారక్ చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు.
అలాగే రాష్ట్రాన్ని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యలక్ష్యమని పేర్కొన్నారు.
అలాగే ఈ కళ్యాణ లక్ష్మి మొట్టమొదట రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయంలో ప్రారంభించినట్లు గుర్తు చేశారు.అప్పు చేసిన నాయకుడు ఫామ్ హౌస్ పరిమితంపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన నాయకుడు ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి ఒక్కటి తుచ తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. ఇది మహిళల ప్రభుత్వం.
ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉచిత బస్సు, కల్యాణ లక్ష్మీ వివిధ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
అలాగే రాష్ట్రాల్లో ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తుందని,15 లక్షల చెక్కర కార్డులు ఇస్తున్నామని,ప్రస్తుతం రైతు ఖాతాల్లోకి రైతు బంధు కూడా ఇస్తున్నామని తెలిపారు.కళ్యాణ లక్ష్మి తో పాటు తులం బంగారం కొద్దిగా ఆలస్యమైన తప్పకుండా ఇస్తామని తెలిపారు.
కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ పార్టీలు ఆతర్వాత జిల్లా అభివృద్ధి కోసమే పాటుపడాలని కోరారు.ఒకప్పుడు నిజామాబాద్ ధనగార జిల్లా, ఇప్పుడు వెనుకబడిన జిల్లాగా మారిందని అన్నారు.
అందుకు జిల్లాకు కావలసిన పరిశ్రమలు,కళాశాలలు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు,క్రీడల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, ఆర్డీవో రాజేంద్రకుమార్,కాంగ్రెస్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
