పరీక్షలో తప్పడాని బీటెక్ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
నగరంలోని సాయికృప నగర్ కు చెందిన రాజరపు శ్రీనివాస్(25).బీటెక్ పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించానని తల్లిదండ్రులకు చెప్పాడు.
ఈ క్రమంలో ఈ నెల 21 న తాను బీటెక్ లో ఫెయిల్ అయ్యానని తల్లికి తీసిందని అందుకు మనస్థాపానికి గురై ఈ నెల 21 న నిజామాబాద్ డిచ్ పల్లి రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.
