HomeCRIMEదేశ చరిత్ర లోనే తీవ్రమైన నేరం ...కెసిఆర్ చెప్పితేనే ప్రభాకర్ చేసి వుంటారు .....650 మంది...

దేశ చరిత్ర లోనే తీవ్రమైన నేరం …కెసిఆర్ చెప్పితేనే ప్రభాకర్ చేసి వుంటారు …..650 మంది బాధితుల పేర్లు బహిర్గతం చేయాలి పీసీసీ చీఫ్ ఆరోపణ

తెలంగాణ లో కెసిఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ స్కామ్ దేశ చరిత్ర లోనే అతి పెద్ద నేరమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన నిజామాబాద్ నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విలేకర్ల సమావేశం లో మాట్లాడారు.

నాయకులు ఉన్నతాధికారులు పారిశ్రామికవేత్తలు సినిమా తారలు జడ్జి ల ఫోన్ లు ట్యాప్ చేసి ఇబ్బందులకు గురిచేశారని మహేష్ పేర్కొన్నారు.

కెసిఆర్ కేటీఆర్ ల ప్రమేయం లేకుండా ప్రభాకర్ స్వతహాగా ట్యాపింగ్ చేసే అవకాశం లేదన్నారు. అతన్ని ఈ ట్యాపింగ్ కోసమే పదవి విరమణ చేసాక కూడా తెచ్చి కీలక బాధ్యతల్లో పెట్టారని ప్రభాకర్ ను ముందు పెట్టి తమ ప్రయోజనాలు పొందారని మహేష్ ధ్వజమెత్తారు.

ఈ వ్యవహారంలో సిట్ లోతుగా పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అలాగే ట్యాపింగ్ అయినా 650 మంది పేర్లు సిట్ బహిర్గతం చేయాలనీ వారందరి వాగ్మూలాలు నమోదు చేయాలనీ డిమాండ్ చేసారు. ..

స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మంత్రివర్గంలో చర్చించిన తర్వాతే షెడ్యూల్‌పై తుది నిర్ణయం వెలువడుతుందని స్పష్టం చేశారు.

అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. కోట్ల ప్రజాధనాన్ని నీళ్లలో పోసిందన్నారు తాము బనకచర్లప్రాజెక్టు విషయంలో తెలంగాణ హక్కుల కోసం వెనక్కి తగ్గబోమన్నారు , ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం జరిగినప్పటికీ బీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments