HomeLaw and Orderపోలీసుల మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరం..పోలీస్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభించిన సీపీ...

పోలీసుల మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరం..పోలీస్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభించిన సీపీ…

పోలీస్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభించిన సీపీ..

నిత్యం పని ఒత్తిడిలో ఉండే పోలీసులకు క్రీడలు ఎంతో మానసిక ఆనందాన్ని కలిగిస్తాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. నిజామాబాదు పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని పోలీస్ మైదానంలో అన్ని విభాగాలైన నిజామాబాద్ సబ్ డివిజన్, ఆర్మూర్ సబ్ డివిజన్, బోధన్ సబ్ డివిజన్, ఆర్ముడ్ రిజర్వ్ విభాగం , అలైడ్ బ్రాంచులు, హోమ్ గార్డ్స్ విభాగం మొదలగు విభాగాల మధ్య పోలీస్ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ..పోలీసు సిబ్బంది ప్రజా రక్షణ కోసం నిరంతరం విధులు నిర్వహిస్తూ ఎంతో ఒత్తిడికి గురవుతు , క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. అందుకే పోలీసులు వీలైన సమయం స్పోర్ట్స్ లో పాల్గొని రిఫ్రెష్ అయి మరింత ఉత్సాహంతో విధుల్లో బాధ్యతలు నిర్వహించాలని అన్నారు. పోలీసులు ఉద్యోగ వృత్తిలో ఎంతో బిజీగా గడుపుతామని, క్రీడలు జీవితంలో మానసిక ఒత్తిడిలను తట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో చాలా బాగా రాణిస్తున్నారని, క్రీడాకారులు అందరిలో స్కిల్స్ టాలెంట్ బాగా ఉన్నాయని అన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి ప్రజల కోసం పనిచేయాలని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ముందు ఉండాలని సూచించారు. ఈ క్రికెట్ మ్యాచ్ రెండు రోజులు నిర్వహించడం జరుగుతుందని క్రీడాకారులు అయినటువంటి పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాదు అదనపు పోలీస్ కమీషనర్ ( అడ్మిన్ ) బస్వా రెడ్డి , అదనపు పోలీస్ కమీషనర్ ( ఏఆర్)రామ్ చందర్ రావ్, నిజామాబాదు ఏసిపి రాజా వెంకట్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments