ఎల్లారెడ్డి. విద్యుత్ షాక్ తో మండలంలోని తిమ్మాపూర్ తండాకు చెందిన నేనావత్ రవికుమార్ ( 32 ) అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం మృతి చెందాడు.
గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రవికుమార్ కు ఇటీవల డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు అయింది.
డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేపట్టిన రవికుమార్ వాటర్ క్యూరింగ్ కోసం విద్యుత్ కనెక్షన్ ఇస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురైయ్యాడు.
విద్యుత్ ఘాతంతో కింద పడ్డ రవికుమార్ ని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ఆస్పత్రి డాక్టర్లు నిర్ధారించారు.
వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
