HomeTelanganaNizamabad29న జిల్లాకు కేంద్రహోం మంత్రి అమిత్ షా రాక..పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించనున్న అమిత్ షా..

29న జిల్లాకు కేంద్రహోం మంత్రి అమిత్ షా రాక..పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించనున్న అమిత్ షా..

పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభ..పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని జిల్లా కేంద్రంలో ఈ నెల 29 న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వచ్చి ప్రారంభిస్తారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ తెలిపారు.

సోమవారం జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించాక పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే రైతు సమ్మేళనం లో పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడతారని అన్నారు.

ఇందూరు ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని ఆయన పేర్కొన్నారు.ఇక నుంచి రైతుల నూతన శకం మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు.

అలాగే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన రైతులందరూ పెద్ద ఎత్తున రైతు సమ్మేళనానికి రావాలని కోరారు. 29 న డీ.శ్రీనివాస్ విగ్రహావిష్కరణ.

ఈ నెల 29 న డీ శ్రీనివాస్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహంను అమిత్ షా ఆవిష్కరిస్తారని తెలిపారు. డిఎస్ విగ్రహాన్ని స్టాచ్యు ఆఫ్ యూనిట్ సర్దార్ పటేల్ విగ్రహ రూపశిల్పి రామ్ సాథుర్ విగ్రహం తయారు చేశారని తెలిపారు.జిల్లాకు మంత్రి పదవి లేకపోవడం దురదృష్టకరం..

రాజకీయంగా చాలా ప్రాముఖ్యత గల జిల్లా,అలాగే చాలా ఉద్యమాలకు ఊపిరి పోసిన ఈ జిల్లాకు మంత్రి పదవి లేకపోవడం దురదృష్టకరం అని అన్నారు.అలాగే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఒక్కరు కూడా మంత్రి పదవికి సరిపోరని ఎద్దేవ చేశారు.

ఇక కల్వకుంట కుటుంబానికి తెలంగాణలో రాజకీయ జీవితం లేదని ఆగ్రహించారు.కుటుంబంలోని కేసీఆర్ పై కాళేశ్వరం అవినీతి,బిడ్డ కవిత లిక్కర్ స్కాం, కేటీఆర్ ఈ కారు రేస్,ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నారని ద్వజమెత్తారు.

అందుకే సీఎం రేవంత్ రెడ్డి వీరిని జైలుకు పంపితే మరిన్ని స్కాం లో బయటపడతాయని తెలిపారు.ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ కి అప్పగించాలని ఆయన బండి సంజయ్,కిషన్ రెడ్డి లను కోరినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి,అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, బిజెపి అధ్యక్షుడు దినేష్ కులచారి,స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments