HomeTelanganaNizamabadబెస్ట్ అవైలబుల్ స్కూల్ పెండింగ్ బిల్లులు చెల్లించాలి..విద్యార్థులు తల్లిదండ్రులతో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన.

బెస్ట్ అవైలబుల్ స్కూల్ పెండింగ్ బిల్లులు చెల్లించాలి..విద్యార్థులు తల్లిదండ్రులతో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన.

బెస్ట్ అవైలబుల్ స్కూల్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.

బెస్ట్ అవైలబుల్ స్కీం కింద చదువుతున్న ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన సామాజిక వర్గం విద్యార్థుల మూడేళ్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.పాఠశాలలు ప్రారంభమై 12 రోజులు కావస్తున్నా పాఠశాల యాజమాన్యాలు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహించారు.

మూడేళ్లుగా రూ.కోట్లల్లో ప్రభుత్వం నుంచి పాఠశాలలకు బకాయిలు రావాలని తెలిపారు.ప్రభుత్వం తరఫునుంచి రావాల్సిన బకాయి రావడంలేదని, కావాలనుకుంటే ఫీజులు చెల్లించి పాఠశాలకు పంపాలని లేనిపక్షంలో పిల్లల్ని పాఠశాల తీసుకురావద్దని యాజమాన్యం చెప్పడంతో గత్యంతరం కలెక్టర్‌కు తమ గోడు విన్నవించుకోవడానికి వచ్చామని తెలిపారు.

ఇప్పటికైనా ప్రభుత్వం బకాయిలు చెల్లించి పిల్లలను ఆదుకోవాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసనలోవిద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments