జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్లను రెండో టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విచారణలో నాలుగవ టౌన్ పరిధిలోని వినాయక్‌నగర్, బోర్గం ప్రాంతాలకు చెందిన రెండు ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు గుర్తించారు. మరో వాహనం డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధికి, ఇంకొకటి రెండో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందినవిగా తేలింది.
చోరీ చేసిన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇంకా ఎక్కడైనా ద్విచక్ర వాహనాలను చోరీ చేశారా ఈ ఘటనల్లో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో రెండో టౌన్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
