HomeTelanganaNizamabadచెట్లకు రాఖీలు.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు

చెట్లకు రాఖీలు.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు

రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీచైతన్య మేడ్చల్‌ ఐపీఎల్‌ ఐసీ, కే2 గర్ల్స్‌ క్యాంపస్‌ పాఠశాలల్లో శుక్రవారం వినూత్నంగా రాఖీ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు చెట్లకు రాఖీలు కట్టి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.‘

వృక్షాలు మనల్ని రక్షిస్తాయి.. అన్నయ్యలా మనకు అండగా నిలుస్తాయి’ అనే సందేశంతో చెట్లకు రాఖీలు కట్టారు. వృక్షాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చాటిచెప్పారు.

‘వృక్షాలను రక్షిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం’ అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏజీఎం రవి, కోఆర్డినేటర్‌ సోమేష్‌, ప్రిన్సిపాళ్లు కిరణ్‌, డీన్‌లు సురేష్‌, హేమంత్‌, ఐపీఎల్‌ ఐసీ ఇన్‌చార్జి శ్రవణ్‌, ఐపీఎల్‌ ఇన్‌చార్జి లక్ష్మణ్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల వినూత్న ఆలోచనను పాఠశాల యాజమాన్యం అభినందించింది. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments