ఇటీవల కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకున్న రాజేశ్వరి డీజీపీ సి.వి. ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన సుదీర్ఘ నాట్య ప్రయాణంతో జాతీయ స్థాయి అవార్డును కైవసం చేసుకుని రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన రాజేశ్వరిని ఈ సందర్భంగా డీజీపీ ప్రత్యేకంగా అభినందించి, కొనియాడారు.
గత 55 సంవత్సరాలుగా భరతనాట్య ప్రదర్శనలు ఇస్తూ డాక్టర్ రాజేశ్వరి సాయినాథ్ కళామతల్లికి నిస్వార్థ సేవ చేస్తున్నారు.
దేశంలోనే కాకుండా అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లోనూ విస్తృతంగా ప్రదర్శనలు ఇచ్చి భారతీయ సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చారు.
