గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పట్టుకున్నట్లు మూడవ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు.ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం..
నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన జ్ఞానేశ్వర్, హైమద్ పుర కు చెందిన షేక్ ఆయష్ మూడవ టౌన్ పరిధిలో ఎండు గంజాయి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు దాడి నిర్వహించి వారి వద్ద ఉన్న 60 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
