గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు.ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం..
రెంజల్ మండలం నీల గ్రామానికి చెందిన పుల్లె లక్ష్మీ నరసింహా నగరంలోని దుబ్బ ప్రాంతంలోని బైపాస్ రోడ్డు వద్ద ఎండు గంజాయి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు దాడి నిర్వహించి అతని వద్ద ఉన్న 250 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో ఎస్ఐ నరసింహచారి, భూమన్న,రాజన్న,కానిస్టేబుళ్లు భోజన్న, విష్ణు, అవినాష్ సాయికుమార్, రాం బచ్చన్ తదితర ఉన్నారు.
