HomeEditorial Specialబకాయి ఫీజు ల పేరుతొ వసూళ్ల దందా .......యస్ ఆర్ కాలేజీ బారి తెగింపు ........విద్యార్థి...

బకాయి ఫీజు ల పేరుతొ వసూళ్ల దందా …….యస్ ఆర్ కాలేజీ బారి తెగింపు ……..విద్యార్థి సంఘాలకుపండ్స్ ఇస్తున్నాం

పాత బకాయి ల పేరుతొ యస్ ఆర్ కాలేజీ యాజమాన్యం విద్యార్థులనుంచి అదనంగా డబ్బు వసూలు చేస్తుంది. తమ వద్ద కొనుగోలు చేయని పుస్తకాల లకు సైతం డబ్బు ఇవ్వాల్సిందే అంటూ బెదిరింపులకు దిగుతున్నారు.

విద్యార్థి సంఘాలకు విచ్చల విడిగా చందా లు ఇస్తున్నాం మీరు ఎవరికైనా చెప్పుకోండి అంటూ తెగేసి చెపుతున్నారు. ఇంటర్ పూర్తీ అయినా విద్యార్థులకు ఇంజనీరింగ్ వెళ్ళడానికి అవసరమైన సర్టిపికెట్ లు ఇవ్వడానికి నిజామాబాద్ నగరంలోని ఎస్సార్ జూనియర్ కళాశాల యాజమాన్యం చుక్కలు చూపిస్తుంది.గట్టిగా అడిగే తల్లిదండ్రుల మీద దౌర్జన్యాలకు దిగుతుంది.

షాట్ మేమో టీసీలు ఇతరార్థ సర్టిఫికెట్లు ఇవ్వడానికి రోజుల తరబడి జాప్యం చేస్తున్నారు‌‌. తల్లిదండ్రులు ఎంసెట్ కౌన్సిలింగ్ ఉండటం వల్ల అందుకు అవసరమైన సర్టిఫికెట్ల ఇవ్వడానికి భారీ మొత్తాల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు.

బకాయి పడ్డ ఫీజులు లేదా స్టడీ మెటీరియల్ కు సంబంధిత ఇతర ఏదైనా ఫీజు బకాయి ఉంటేపూర్తిగా చెల్లించి నో డ్యూ అని లెటర్ ఉంటే తప్ప ఎటువంటి సర్టిఫికెట్లు మంజూరు చేయడం లేదు. విద్యార్థి టీసి తీసి ఇవ్వాలన్న 200 రూపాయలు షార్ట్ మెమో జిరాక్స్ కావాలంటే పది రూపాయలు వసూలు చేస్తున్నారు. కౌన్సిలింగ్ ఉండటం వలన ఎలాగైనా చెల్లిస్తారని ఉద్దేశంతో కాలేజీ యాజమాన్యం ఈ విధంగా మొండిగా వ్యవహరిస్తుంది.

గతంలో ఫీజు చెల్లించి మెటీరియల్ కొనని వారికి మెటీరియల్ యొక్క ఫీజు డ్యూ అని చూయించి ఈ మెటీరియల్ ఫీజు కట్టాలని తెల్చి చెప్పుతున్నారు. విద్యసంవత్సరం పూర్తయి ఉన్నత చదువులు చదువుతున్నారు మాకు ఇప్పుడు ఏమి అవసరం అని అడగగ స్టడి మెటియల్ ఫీజు తీసుకోక తప్పదు అని కాలేజి యాజమన్యం తెలిపింది.

మేము ఎలా చెల్లిస్తామని అడిగితే మెటీరియల్ డబ్బులు చెల్లించనిదే టీసి ఇవ్వమని చేపారు.విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాసంస్థలు మెటీరియల్ నోట్స్ అమ్మ రాదు కదా అని ప్రశ్నిస్తే మీరు ఎవరికైనా చెప్పుకోండి అని సమాధానం ఇస్తున్నాను రేపే కౌన్సిలింగ్ ఉండడం వల్ల విద్యార్థులు మరియు తల్లిదండ్రులలో భయందోళలకు గురి అయి ఎలాగో అలా ఫీజు చెల్లిస్తున్నారు. అక్కడ ఉన్న వచ్చిన తల్లిదండ్రులు ఇది సంగతి కి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments