పెండింగ్ లో ఉన్న ఫీజ్ రీయింబర్స్మెంట్,స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలనీ (టి జి వి పి ) ఫ టీజీవీపీ నగర అధ్యక్షులు అఖిల్ డిమాండ్ చేశారు. రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో 7500వేల కోట్ల ఫీ రియంబస్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయనీ అన్నారు. గత ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిన్నచూపు చూసింది,కొత్తగ ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల తో పిట్టల దొర వేషాలు వేస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆనాటి సీఎం వై ఎస్ రాజశేఖర్ చేపట్టిన ఫీ రింబస్మెంట్ స్కాలర్షిప్ పథకాని కొనసాగించ లేక పోతున్నారు. అకాడమిక్స్ కంప్లీట్ అయిన విద్యార్థులు కాలేజ్ కి ఫీ కట్టలేక అప్పులు చేస్తున్నారు చేసి లేదా పేద విద్యార్థులు..
చదువు పై ఆశలు వదులుకుంటున్నారన్నారు.మధ్య తరగతి విద్యార్థుల తలిదండ్రులు అప్పులు చేసి పుస్త మట్టెలు అమ్మి విద్యార్థుల ఫీలు కట్టే పరిస్థి ఏర్పడిందన్నారు.
పేద విద్యార్థులు ఆర్థికంగా లేక చదువులు మని కూలీ పనులు చేసుకుంటున్న దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రం లో ఉందని మండి పడ్డారు. విద్యార్థుల అక్కులని హరిస్తున్నారు , ప్రపంచ అందాల పోటీలకు 200 కోట్లు రూపాయలు ప్రజా ధనాన్ని గంగపాలు చేశారు ,ఉచిత పథకాల పేరిట రాష్ట్ర నిధులని దుర్వినియోగం చేస్తున్నారు.
తమ పార్టీకి చెందిన కాంట్రాక్టర్ల , కాంటరాక్టర్ల గా ఉండి ఎమ్మల్యేగా మంత్రులుగా ఉన్న వారి బిల్లులు కోట్ల రూపాయలు ఉన్న వెంటనే విడుదల చేస్తుంది, కానీ ఇదే పథకానికి ఆసరా గా చేసుకొని చదువుతున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల ఫీజులు కట్టడం లో మాత్రం మొండి చెయ్యి చూపిస్తుంది అన్నారు ‘ విద్యార్థులకు విద్యా హక్కు నుండి మరలించే ఆర్థిక సమస్యలను తొలగించడమే ప్రభుత్వ బాధ్యత” అని పేర్కొన్నారు.
తక్షణమే బకాయిలను విడుదల చేయాలి లేని పక్షం లో కాంగ్రెస్ మంత్రులను, సీఎం ని ఎక్కడికి అక్కడ అడ్డుకుంటాం అని హెచ్చరించారు.
