నిజామాబాద్ నగర ఆర్యవైశ్య సంఘం ఎన్నికల పోలింగ్ రసాభాసా అయ్యాయి.
పోలింగ్ పక్రియ లో తలెత్తిన వివాదం నేపథ్యంలో సోమవారం జరగాల్సిన కౌంటింగ్ సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఆర్య వైశ్యా సంఘం తో పాటు దాని అనుబంధ సంఘాలకు ఆదివారం పోలింగ్ నిర్వహించారు.
ఈ ప్రక్రియ మధ్యాహ్నం వరకు సజావుగా కొనసాగినా, సాయంత్రం అనేక వివాదాలు చుట్టుముట్టాయి .ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారుల వైఖరి మీద విమర్శలు వెల్లువెత్తాయి.
ఒకరిద్దరు అధికారులు ఏక పక్షంగా వోట్లు వేయించడం తో వివాదం మొదలయ్యింది. మొదట అభ్యర్థులు ఎన్నికల అధికారులపై ‘మీరు అమ్ముడుపోయారని’ ఆరోపణలు చేసారు.
ఈ ఆరోపణలతో ఎన్నికలను పర్యవేక్షిస్తున్న అధికారులు బాధ్యత వదిలేసి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.అధికారుల అర్దాంతరంగా వెళ్లడం తో కొంతమంది అభ్యర్థులు, వారిని మద్దతు ఇస్తున్న కార్యకర్తలు అత్యుత్సాహం చూపి కౌంటింగ్ ప్రక్రియను వక్రీకరించే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
ఈ గొడవ రాత్రి పొద్దు రెండు, మూడు గంటల వరకూ కొనసాగింది. మొదట పోలింగ్ పద్ధతిగా ముగిసినా, కౌంటింగ్ వాయిదా పడడం అభ్యర్థులు, సంఘ సభ్యుల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. ఈ ఉదంతంపై అధికారులు
ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అభ్యర్థులు, కార్యవర్గ సభ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కౌంటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
