జిల్లా పోలీస్ శాఖ లో సరికొత్త శకం కు కమిషనర్ తెరలేపారు. పోలీసు శాఖ కు నారీ శక్తి ని జోడించి వినూత్న ప్రయాగం చేశారు. ఇటీవలే శిక్షణ పూర్తీ చేసిన మహిళా ఎస్సై లకు కీలక మైన పోస్టింగ్ లు ఇచ్చారు.
లా అండ్ ఆర్డర్ లో సత్తా చాటడానికి వారికి ఛాన్స్ ఇచ్చారు. ఏకంగా నాలుగు కీలకమైన ఠాణాలకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా నియామకం చేసారు.
సీనియర్ ఎస్సై లు ఎంతో మంది అందుబాటులో ఉన్న సరే చట్టాల మీద ఇప్పుడే అవగాహన తెచ్చుకున్న యువ ఎస్సై లను కార్యక్షేత్రం లో కి దించడం పోలీస్ శాఖ లో హాట్ టాపిక్ గా మారింది. శిక్షణ పూర్తీ చేసిన అధికారులకు లా అండ్ ఆర్డర్ లో పోస్టింగ్ లు ఇవ్వడం పోలీస్ శాఖ లో ఆనవాయితీ గా వస్తుంది.
శాంతి భద్రతల నిర్వహణలో కొత్త అధికారులకు కనీస అనుభవం ఉండేలా చేయడానికే ఇది అనివార్యంగా భావించే వారు. అందుకోసం పోలీసు బాస్ లు ఎడతెగని కసరత్తులు చేస్తారు. రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి సీనియర్లు తప్పించి పోస్టింగ్ లు ఇవ్వడం వారికి కత్తిమీద సాముగా వుండేది.
అందులోనూ దిగ్గజ నేతలున్న జిల్లాలో ఎలాంటి సిఫార్స్ లు లేకుండా అధికారులకు పోస్టింగ్ లు దక్కని పరిస్థితి. ఈ నేపథ్యంలో కమిషనర్ గా కొద్దీ నెలల క్రితమే వచ్చిన బాధ్యత లు చేపట్టిన సాయి చైతన్య ఇలాంటి పరిస్థితులను అధిగమించి మరీ శిక్షణ పూర్తీ చేసిన ఎస్సై లకు పోస్టింగ్ లు ఇచ్చారు.
ఎన్నికల కోడ్ లో జిల్లా ను వదిలేసిన అనేక మంది అధికారులు మళ్ళీ జిల్లాలో పోస్టింగ్ లకోసం అధికార పార్టీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అందుకే కొత్త అధికారులకు లా అండ్ ఆర్డర్ లో సర్దు బాటు చేయడం సహజంగానే కత్తి మీద సాము గా భావించారు.
కానీ కొత్వాల్ ఈసారి పోస్టింగ్ ల్లో కొత్త ఒరవడికి తెరలేపారు. శిక్షణ పూర్తీ చేసిన అధికారులలో మహిళా అధికారులందరూ లా అండ్ ఆర్డర్ లో ప్రావీణ్యం సంపాదించేలా వారికి జిల్లాలో ఏకంగా నాలుగు ఠాణాలకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా నియామకం చేసారు.
అదికూడా కీలక మైన ఠాణాలు కావడం గమనార్హం. ఇందులో మామిడి పల్లి కళ్యాణి కి అత్యంత మారుమూల ప్రాబల్యం ప్రాంతం అయినా సిరికొండ ఎస్సైగా నియమించారు మరో లా అండ్ ఆర్డర్ పరంగా సున్నితమైన ఎడపల్లి ఎస్సై గా ముత్యాల రమా ను గిరిజన తండా ఎక్కువగా ఉన్న మోపాల్ ఎస్సై గా సుస్మిత .
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ పరిధి లోకి వచ్చే మెండోరా ఎస్సై గా జాదవ్ సుహాసిని లు నియామకం అయ్యారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. ఎమ్మెల్యే భూపతి రెడ్డి లు సొంత నియోజకవర్గాల్లో ను మహిళా ఎస్సై లు నియామకం కావడం గమనార్హం.
ఈసారి పోస్టింగ్ ల్లో కొత్వాల్ అధికార పార్టీ సిఫారస్ లను పట్టించుకోలేదు. సొంత వ్యూహం తోనే యువ అధికారులకు పోస్టింగ్ లు ఇచ్చారనే చర్చ జరుగుతుంది.
