నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రెగ్యులర్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణ మాల కొండారెడ్డిని నియమిస్తూ వైద్య ఆరోగ్య, ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ రాష్ట్ర ప్రభుత్వ కార్య దర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్రూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆయన ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీ కార్డియాలజీ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గా శ్రీనివాస్ కొనసాగుతున్నారు.
