HomeEditorial Specialగులాబీ కోటకు మరో వారసుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న గంప తనయుడు .......లండన్ కు గుడ్...

గులాబీ కోటకు మరో వారసుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న గంప తనయుడు …….లండన్ కు గుడ్ బై కామారెడ్డి లోనే అడ్డా ……….

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో మరో వారసుడి రాజకీయ ఎంట్రీకి రంగం సిద్ధం అవుతుంది. గులాబీ కోట లో మరో వారసుడి ప్రస్థానం మొదలు కాబోతుంది.

బిఆర్ యస్ లో దిగ్గజ నేతగా ఉన్న గంప గోవర్ధన్ తనయుడు రాజకీయాల్లోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. లండన్ స్థిరపడ్డ ఆయన ఉద్యోగం వదిలేసి కామారెడ్డి కి మకాం మార్చేశారు. లండన్ కు గుడ్ బై చెప్పి కామారెడ్డి నే తన రాజకీయ అడ్డా గా చేసుకోబోతున్నారు.

కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తనయుడు గంప శశాంక్. బిఆర్ యస్ పార్టీలో క్రియ శీలా నేతగా మారబోతున్నారు ఓ పక్క విదేశీ చదువు… ఆపై కార్పొరేట్ జీవితాన్ని వదిలిపెట్టి… తండ్రి నడిచిన బాట లోనే నడవడానికి సమాయత్తం అవుతున్నారు .

లండన్ లో మాస్టర్స్ పూర్తి చేసి, అక్కడే ఉద్యోగం లో స్థిరపడ్డ శశాంక్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది.కామారెడ్డి నియోజకవర్గ చరిత్ర లోనే అయిదు సార్లు ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహించిన గంప గోవర్ధన్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధినేత కెసిఆర్ కోసం టికెట్ త్యాగం చేసారు.

టికెట్ దక్కక పోయిన సరే కెసిఆర్ వెంటే నడిచారు. బీజేపీ కాంగ్రెస్ ల నుంచి పిలుపు వచ్చినా ససేమిరా అన్నారు. ఎలాగో కెసిఆర్ స్వయంగా తన రాజకీయ భవిష్యత్ కు భరోసా ఇచ్చిన నేపథ్యంలో గంప నింపాది గా కొనసాగుతున్నారు.

కామారెడ్డి నియోజకవర్గ చరిత్రలో తన తండ్రి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేందుకు… ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ నేనున్నాను అనే భరోసానిస్తూ… అరుదైన వ్యక్తిత్వం కలిగిన శశాంక్ వేస్తున్న అడుగులు..

బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. అధికారంలో ఉన్న లేకపోయినా, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై స్పందిస్తున్నాడు.

స్పష్టమైన విజన్ తో కామారెడ్డి గడ్డమీద గులాబీ జెండాను ఎగరవేసినందుకు కార్యకర్తలను చైతన్యం చేస్తూ ముందుకు దూసుకెళ్లే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు.

నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బి ఆర్ ఎస్ కార్యకర్తలలో కొంత నిరాశ నెలకొన్న సమయంలో, వారిని చైతన్యవంతం చేస్తూ ప్రజా సమస్యలపై పోరాడేందుకు యువనేత గంప శశాంక్ వేస్తున్న అడుగులు కొత్త రాజకీయ ఒరవడిని సృష్టిస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments