HomeTelanganaNizamabadనిజామాబాద్ జిల్లా బోర్గం పీ ప్రైమరీ మరియు హై స్కూల్‌ లో పర్యటన (టీ జి...

నిజామాబాద్ జిల్లా బోర్గం పీ ప్రైమరీ మరియు హై స్కూల్‌ లో పర్యటన (టీ జి వీ పీ )

నిజామాబాద్ జిల్లా బోర్గం (పీ) ప్రైమరీ పాఠశాల మరియు హై స్కూల్‌ను నగర అధ్యక్షుడు అఖిల్ పరిశీలించారు.

విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన పరిశీలించారు తదంతరం అఖిల్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకి భోజనం అందించాల్సిన బాధ్యత పాఠశాల అధికారులపై ఉందని అన్నారు.

అయితే ప్రాథమిక పాఠశాలలో మెనూను పాటించకపోవడం, కేవలం అన్నం మరియు సాంబార్‌తో మాత్రమే భోజనం పెట్టడం సరికాదు అని పోషకాలు ఎక్కువగా ఉన్న గుడ్డు వంటివి లేకపోవడం బాధాకరం అని ఈ సందర్బంగా హై స్కూల్‌లో ప్రిన్సిపాల్ తో మాట్లాడగా ప్రభుత్వం నుంచి మాకు నిధులు రావడం లేదు అందువలన మెనూ ప్రకారం పెట్టలేక పోతున్నం అని అన్నారు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ, వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.

కార్యకర్తలతో కలిసి వారు చెప్పిన విషయాలు అన్ని నోట్ చేసుకొని సమస్యలు పరిష్కారం కోసం పోరాటం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని. మెనూ ప్రకారం భోజనం లభించకపోతే విద్యార్థులతో ఆందోళనకు దిగాల్సి వస్తుంది అని అధికారులకి హెచ్చరించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments