గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రూర్ మండల చెరువు నుండి బొప్పాపూర్ వాగు నుండి భారీగా వరద నీరు ప్రవహించడంతో శనివారం మండల తాసిల్దార్ తారాబాయి, ఎస్సై పి. సాయన్న రాకపోకలు నిలిపివేయడం జరిగింది.
ప్రజలు, రైతులు ఎవరు కూడా వంతెన పైనుండి ప్రవహించే నీటిలో నుండి వెళ్ళకూడదని హెచ్చరికలు జాబ్ చేశారు.
ఇరువైపులా ట్రాఫిక్ బోర్డులను పెట్టి దారులను మూసి వేయడం జరిగింది భారీ వర్షాల వల్ల ఏమైనా ప్రమాదాలు జరిగితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులు తెలిపారు. ముఖ్యంగా రైతులు వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు పంట పొలాలకు వెళ్లకూడదని తెలిపారు.
