నిజామాబాద్ పట్టణంలోని దుబ్బ ఉన్నత పాఠశాలను తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ ఆధ్వర్యంలో సంఘం కార్యకర్తలు ఈ రోజు సందర్శించారు.
ఈ సందర్భంగా బొబ్బిలి కళ్యాణ్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్న సందర్భంలో విద్యార్థులు తమ సమస్యలను తెలియజేశారు.
నాలుగు వందలమంది విద్యార్థులకు గాను నాలుగు మూత్ర విసర్జన శాలలు ఉన్నాయని.అవి కూడా ఉపాధ్యాయులు మాత్రమే వాడుకుంటున్నారని మూత్ర విసర్జనకు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని,బాలురు బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారని తెలిపారు.
తరగతి గదులలో లైట్స్ లేవని వర్షాలు కురుస్తున్నపుడు పగటిపూట చీకట్లు కమ్మేస్తున్నాయి అని తెలిపారు.మధ్యాహ్న భోజనం అధ్వాన్నంగా ఉంటుందని మెనూ పాటించడం లేదని అన్నం అసలు ఉడకకుండానే వొడ్డిస్తున్నారని మెను ప్రకారం పౌష్టిక ఆహారం అందడం లేదని తెలిపారు.
కరెంట్ బోర్డుల నుండి వైర్లు బయటకు వచ్చి ప్రమాదకరంగా మారాయని వర్షం కురిసినపుడు గోడలకు తాడివల్ల ఎర్తిగ్ వస్తుంది అన్నారు. TGVP టీమ్ పాఠశాల మొత్తం తిరిగి పరిశీలించి చూడగా బయటి వ్యక్తులు పాఠశాలలో సిగరెట్లు మద్యం సేవిస్తున్న ఆనవాళ్లు కనిపించాయి.
పై సమస్యలపై పాఠశాల ఉపాధ్యాయులను ప్రశ్నించగా తమకు గవర్నమెంట్ నుండి సరైన నిధులు కేటాయించడం లేదు అని సమాధానం ఇచ్చారు.
సమస్యలపై అధికారుల,ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పాఠశాల ఆవరణలో నిలువ ఉన్న వర్షపు నీటిలో TGVP టీమ్ ఫుట్ బాల్ ఆడి నిరసన తెలిపారు.పాఠశాల నిర్వహణ పై తోరలోనే అధికారులను నిలదీస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు అఖిల్ కార్యకర్తలు సుజిత్ ధర్మేందర్ మహేష్ సిద్ధు తదితరులు పాల్గొన్నారు….
