HomeTelanganaNizamabadఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలనీ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ పేర్కొన్నారు. శ్రీరామ గార్డెన్లో నిర్వహించిన ఆర్యవైశ్య పట్టణ సంఘం,అనుబంధ సంఘాల విజయోత్సవ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొని మాట్లాడారు.

1944 లో స్థాపించిన ఆర్యవైశ్య సంఘానికి ఒక ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఆర్య వైశ్యులు అంటేనే సమాజంలో సేవకు మారు పేరుగా అన్నదాన కార్యక్రమాల నుండి విద్య, వైద్యం, ఆధ్యాత్మికంగా అన్ని రంగాలలో సేవలందించడంలో ముందుంటారన్నారు.

సంపద సృష్టించడంలోకూడా ముందుంటూ 80% పన్నులను ప్రభుత్వలకు చెల్లెస్తున్నారని, ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాల్లో కూడా మన సేవ ఉన్నందుకు గర్వాంగా ఉందన్నారు. అన్ని రంగాలలో ముందున్న మనం ఒక రాజకీయ రంగంలో వెనుకపడిపోతున్నాం.

అని రాజకీయంగా కూడా ఆర్యవైశ్యులు ఎదగాలి ప్రభుత్వ ఏర్పాటులో మనం కీలక పాత్ర పోషించాలని అన్నారు. స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినా అగ్రవర్ణాల పేదల అభివృద్ధి గురించి ఏ నాయకుడు ఆలోచించలేదని బిజెపి మోదీ అధికారంలోకి వచ్చాక అగ్రవర్ణంలో ఉన్న పేదల గురించి ఆలోచించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% కల్పించిన ఘనత మోదీ గారికి బిజెపి పార్టీకి దక్కుతుంది.

ఆర్యవైశ్య పట్టణ సంఘం దాని అనుబంధ సంఘాల ఎన్నికల్లో ధర్మం గెలిసింది అనడానికి ఎటువంటి సందేహం లేదన్నారు. ధర్మాన్ని నిలబెట్టుటకు ఆనాడు కురుక్షేత్ర యుద్ధం జరిగితే ఈనాడు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు జరిగిన ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో ధర్మం నిలపడి గెలిచింది అనేది వాస్తవం అన్నారు.

ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఈ ఆర్యవైశ్య పట్టణ సంఘ ఎన్నికల గురించి కొంత మంది ఎక్కువ ఆలోచిస్తున్నారు ఆలా అలోచించి చివరికి నవ్వులపాలు కావద్దని విజ్ఞప్తి చేసారు.

ఓటమిని అంగీకరించడం కూడా విజయానికి తొలిమెట్టు అవుతుందని దానికి తనే నిదర్శనం అని తెలియజేసారు.

నూతనంగా గెలిసిన వారందరిని అభినందిస్తూ ఈ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందనే విషయం నూతన అధ్యక్షా & కార్యవర్గం గుర్తుపెట్టుకోవాలన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సంఘ అభివృద్ధిలో కృషి చేయాలనీ విజ్ఞప్తి చేసారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా,మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా, ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు ధన్ పాల్ శ్రీనివాస్ గుప్తా, ప్రధానకార్యదర్శి ఇల్లేందుల ప్రభాకర్, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments