HomePOLITICAL NEWSUncategorizedకళ్యాణి ప్రాజెక్టు లో 330 క్యూసెక్కు ఇన్ఫ్లో...--- రెండు గేట్ల ద్వారా మంజీరాలోకి వరద నీరు..---పొంగి...

కళ్యాణి ప్రాజెక్టు లో 330 క్యూసెక్కు ఇన్ఫ్లో…— రెండు గేట్ల ద్వారా మంజీరాలోకి వరద నీరు..—పొంగి పొర్లుతున్న తాటివాని మత్తడి..

ఎల్లారెడ్డి రెండు రోజులుగా కురిసిన వర్షాలకు మండలంలోని కళ్యాణి వాగు ప్రాజెక్ట్ లోకి 330 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది.ఆదివారం ఉదయం రెండు రేడియో గేట్ల ద్వారా అంతే నీటిని మంజీరా నదిలోకి వదులుతున్నారు.

ప్రాజెక్టు ఎగువ భాగంలోని కళ్యాణి ,అడవి లింగాల్, తిమ్మాపూర్, భవానిపేట అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రాజెక్ట్లోకి వరదనీరు వచ్చి చేరుతుంది.

దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 408.00 మీటర్లకు చేరుకోవడంతో రెండు రేడియల్ గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 330 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుంది.

వర్షం తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టులకు వచ్చే ఇన్ఫ్లో సైతం తగ్గుముఖం పడుతుంది. ప్రాజెక్టులోకి వచ్చే క్యూసెక్కులను బట్టి ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా అంతే నీతిని మందిరా నదిలోకి వదులుతామని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్లు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 408.00 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు నీటిని వదులుతున్న దృశ్య నీటిపారుదల శాఖ సిబ్బంది అక్కడ పహారా కాస్తున్నారు.

పొంగిపొర్లుతున్న తాటివాని మత్తడి. మండలంలోని తాటివాని మత్తడి పొంగిపొర్లుతుంది. భవానిపేట్, కొండాపూర్ తదితర అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు తాటివాని మత్తడిలోకి వస్తుంది. మత్తడి సామర్థ్యం మేర నీరు చేరుకొని మత్తడి పై నుంచి పొంగిపొర్లుతుంది.

భారీగా వస్తున్న వరద నీరు కళ్యాణి గ్రామం మీదుగా తిమ్మారెడ్డి గ్రామ శివారులోని కల్యాణ వాగు ప్రాజెక్టులోకి ప్రవహిస్తుంది. అంతేకాకుండా మండలంలోని తిమ్మాపూర్, తిమ్మారెడ్డి, వెల్లుట్ల, బొల్లారం, లక్ష్మాపూర్ తదితర చెరువుల్లోకి క్రమక్రమంగా నీటిమట్టం పెరుగుతోంది.

వర్షాకాలం ప్రారంభమైన తర్వాత రెండు రోజులపాటు వర్షం కురవడంతో నీరు పలు చెరువుల్లోకి చేరుతుంది. రెండు మూడు భారీ వర్షాలు కురిస్తే మండలంలోని చిన్న చెరువులు కుంటలతో పాటు పెద్ద చెరువుల సైతం నిండిపోయే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments