Tuesday, April 21, 2026
HomePOLITICAL NEWSArmoorరేపు ఎల్లుండి జిల్లాలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర.......భారీగా ఏర్పాట్లు చేస్తున్న నేతలు .......పీసీసీ చీఫ్...

రేపు ఎల్లుండి జిల్లాలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర…….భారీగా ఏర్పాట్లు చేస్తున్న నేతలు …….పీసీసీ చీఫ్ సొంత జిల్లాలో సూపర్ హిట్ ఫై అంచనాలు ……..ఆలూర్ నుంచి ఆర్మూర్ పాదయాత్ర …..అర్గుల్ మీటింగ్

కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జనహిత యాత్ర జిల్లాలో రెండు రోజులు జరగబోతుంది. రేపు ఎల్లుండి జరిగేలా ప్రణాళిక ఖరారు చేసారు. శనివారం సాయంత్రం తో మొదలై ఆదివారం మధ్యాహ్నం తో ముగుస్తుంది.

ఆర్మూర్ నియోజకవర్గంలో ని ఆలూర్ గ్రామం నుంచి ఆర్మూర్ దాక శనివారం సాయంత్రం పాదయాత్ర చేస్తారు. ఆర్మూర్ లోనే బస చేసి మరుసటి రోజు ఉదయం శ్రమదానం చేసి మధ్యాహ్నం జక్రాన్ పల్లి మండలం అర్గుల్ లో ఓ ఫంక్షన్ హల్ లో ఉమ్మడి జిల్లా ల ముఖ్య కార్యకర్తల తో సమావేశం వుంటుంది.

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో జనహిత కార్యక్రమాలను సక్సెస్ చేయడం ఫై పార్టీ యంత్రాంగం దృష్టి పెట్టింది.

పీసీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ కార్యక్రమానికి భారీఎత్తున ప్రజలను తరలించేలా స్థానిక నాయకత్వం సమాయత్తం అవుతుంది.

పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో పాటు ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ లు పాల్గొనబోతున్నారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ వినయ్ రెడ్డి లు పార్టీ నేతలతో సమావేశం అయ్యారు.

నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగే ప్రాంతాల్లో దారి పొడవున భారీ కటౌట్స్ ,ఫ్లెక్సీల ఏర్పాటు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!