HomeCRIMEముగిసిన ఆపరేషన్ ముస్కాన్..జిల్లాలో మొత్తం 154 మంది బాలల వివరాలు గుర్తింపు..

ముగిసిన ఆపరేషన్ ముస్కాన్..జిల్లాలో మొత్తం 154 మంది బాలల వివరాలు గుర్తింపు..

బాల కార్మికుల చేత పని చేయించుకోవడం చట్టరీత్యా నేరమని అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నా ఇప్పటికీ కొందరు చిన్నపిల్లల చేత వివిధ రకాల పనులు చేయించుకుంటున్నారు.

బాల కార్మికులకు పని నుంచి విముక్తి కలిగించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో జులై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ సాగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.

జిల్లాలోని పోలీసు
సిబ్బంది, బాలల సంరక్షణ అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులు, కార్మికశాఖ అధికారులను బృందంగా ఏర్పాటు చేశారు.

జిల్లా వ్యాప్తంగా బృందాలను ఏర్పాటు చేయగా నెల రోజుల పాటు పట్టణాలు, మండల కేంద్రాల్లోని కిరాణా, మెకానిక్ దుకాణాల్లో, ప్రయాణ ప్రాంగణాల్లో, వద్ద తనిఖీలు నిర్వహించారు.

జిల్లా వ్యాప్తంగా మొత్తం 154 మంది చిన్నారులను గుర్తించినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో మొత్తం 154 మంది (148 మంది మగపిల్లలు మరియు 6 మంది ఆడపిల్లలు) పిల్లలను రెస్క్యూ చేయడం జరిగింది.

అలాగే నిజామాబాద్ డివిజన్ పరిధిలో 15,ఆర్మూర్ డివిజన్ లో 12,బోధన్ డివిజన్ పరిధిలో 9,మొత్తం 36 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

అలాగే తప్పిపోయిన పిల్లల వివరాలను “దర్పన్ యాప్ లో ” నమోదు చేసి వారి అడ్రస్ లను గుర్తించడానికి ప్రయత్నించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments