HomeTelanganaNizamabadబనక చర్ల మీద ఆరడుగుల హరీష్ అబద్దాలు ఆడుతున్నారు ......అపెక్స్ మీటింగ్ లో ..... కెసిఆర్...

బనక చర్ల మీద ఆరడుగుల హరీష్ అబద్దాలు ఆడుతున్నారు ……అపెక్స్ మీటింగ్ లో ….. కెసిఆర్ హామీ నే ఏపీ అలుసుగా తీసుకుంది…………పీసీసీ చీఫ్ మహేష్

బనకచర్ల విషయంలో ఆరడుగుల హరీష్ అబద్దాలు ఆడుతున్నారని తామేదో తప్పు చేసి నట్లుగా ప్రభుత్వం మీద బట్టకాల్చి మిదేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు ఆయన ఆదివారం జక్రాన్ పల్లి లో ఉమ్మడి జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశం లో మాట్లాడారు.

తెలంగాణ ఏర్పాటు అయ్యాక సీఎం హోదా లో ఏపీ కి వెళ్లిన కెసిఆర్ రాయలసీమ ను రతనాల సీమా చేస్తానంటూ ప్రగల్బాలు పలికారు ఏపీ ని సస్యశ్యామలం చేస్తన్నారని మహేష్ గౌడ్ గుర్తు చేసారు

2016 లో అపెక్స్ మీటింగ్ కు వెళ్లిన కెసిఆర్ గోదావరి లో మూడు వేల టియంసి ల నీళ్లు వెళ్తున్నాయని తమకు వెయ్యి టియంసి లు చాలంటూ మాట్లాడారని ఏపీ అదే అలుసుగా తీసుకోని 90 వేల కోట్ల తో జీవో లు ఇచ్చారని గోదావరి నీటిని కృష్ణ కు మళ్లించే ఎత్తుగడ వేశారని

సీఎం రేవంత్ ఉత్తమ్ రెడ్డి లు వెళ్లి కేంద్రం వద్ద పిర్యాదు చేస్తే ఆపేశారని ఆయన గుర్తు చేశారు అధికారం లో వుండగా ఇష్టానుసారంగా మాట్లాడిన బిఆర్ యస్ నేతలు ఇప్పుడు అదే ధోరణి తో ఉన్నారన్నారు పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు పదవులువస్తాయని

కొత్త వారు వచ్చినా పాత నేతలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు రేవంత్ సమక్షంలో ఖర్గే ఆదేశాలతోనే పాదయాత్ర జరుగుతున్నదన్నారు కానీ దీనిపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు రాతలు రాస్తున్నాయని ప్రజలకు మరింత చేరువయ్యేందుకే పాదయాత్రలు చేపట్టామన్నారు

సర్వే ఆధారంగా స్థానిక ఎన్నికల్లో గెలిచే వారికే సీట్లు ఉంటాయన్నారు. బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా ద్వారా ఎల్లో జర్నలిజం నడిపిస్తున్నారని కవిత ఏ పార్టీ లో ఉన్నారో ఆమె స్పష్టత ఇవ్వాలన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments