HomeTelanganaNizamabadకాలనీ సభ్యుల ఐక్యతతో భవన నిర్మాణం అభివృద్ధిపైనే ప్రధాన దృష్టి.. నిజామాబాద్ కార్పొరేషన్ కు...

కాలనీ సభ్యుల ఐక్యతతో భవన నిర్మాణం అభివృద్ధిపైనే ప్రధాన దృష్టి.. నిజామాబాద్ కార్పొరేషన్ కు రింగు రోడ్డు అవసరం.. కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..

ప్రభుత్వంపై ఆధారపడకుండా కాలనీవాసులు ఐక్యతతో కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడం అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఓల్డ్ ఎన్జీవోస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…నగరంలోని అన్ని డివిజన్లలోకెల్లా అత్యధికంగా వ్యాపారులు, మేధావులు, విద్యావంతులు ఎన్జీవోస్ కాలనీ ఉన్నారన్నారు. అందరి కృషితోనే అద్భుతమైన నిర్మాణం జరిగిందన్నారు. ప్రభుత్వ సహకారం కూడా ఉండాలని, తన ఎమ్మెల్యే ఫండ్ వచ్చిన తర్వాత తన వంతు సహకారం అందిస్తానన్నారు.

తన ట్రస్టు ద్వారా సాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే పాత పనులపై అనేకసార్లు మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లానన్నారు. తొందర్లో సీఎం ని కలిసి నగరాభివృద్ధి కోసం లేఖను అందించనున్నట్లు చెప్పారు. ఎలక్షన్ల ముందే రాజకీయమని, తర్వాత అందరినీ కలుపుకొని అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారంతో కేంద్ర నిధులు పుష్కలంగా అందుతున్నాయన్నారు.

రాష్ట్రంలో మూడు జిల్లాలకు రింగ్ రోడ్డు కేటాయించారన్నారు. కానీ నిజామాబాద్ కేటాయించకపోవడం దురదృష్టకరమని వాపోయారు. రాష్ట్రంలో వరంగల్ తర్వాత అతిపెద్ద నగరం నిజామాబాద్ అని, అయినా మంజూరు చేయలేదన్నారు. అలాగే రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా స్పెషల్ ఫండ్ మంజూరు కానీ నియోజకవర్గ నిజామాబాద్ ఒక్కటేనన్నారు.

పక్కనే ఉన్న రూరల్ కు అందజేస్తున్నారు కానీ ఇందురుపై వివక్ష చూపుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, నూడా చైర్మన్ కేశ వేణు వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, కార్పొరేటర్లు జ్యోతి, మురళి, నాగోల్ల లక్ష్మీనారాయణ, పరమేశ్వర్, మఠం పవన్, ప్రవీణ్ గౌడ్, అసోసియేషన్ అధ్యక్షుడు పోతనకర్ లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు వాసు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments