డొంకేశ్వర్ మండల నూతన తహసిల్దారుగా బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించిన ప్రసాద్ ని గురువారం పలువురు ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ విశ్వకర్మ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి, డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడుగణేష్ గౌడ్ తహసిల్దార్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రసాద్ కి పూలమాల వేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు.మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ, పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించి మండలాన్ని ప్రగతి పథంలో నడిపించాలని వారు కోరారు.మండల అభివృద్ధికి ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని
ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు.తమను కలిసి అభినందనలు తెలిపినందుకు తహసిల్దార్ ప్రసాద్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
