తెలంగాణ లో ఖ్యాతి గాంచిన చర్చ్ అఫ్ సౌత్ ఇండియా నిర్వహణలో ఉండే నిజామాబాద్ చర్చ్ లో ఈ ఆదివారం ఎన్నికల కోలాహలం కనిపించింది.
చర్చ్ పాలక మండలి కోసం మూడు ఫ్యానెల్ లు బరిలోకి దిగాయి. ఇదివరకు రెండేళ్ల కాలపరిమితి వుండగా ఈసారి మూడేళ్ల కాలపరిమితి కావడంతో ఆయా ఫ్యానెళ్లు హోరాహోరీగా తలపడ్డాయి.
పోలింగ్ పక్రియ సాయంత్రం దాక సాగింది ఎలాంటి ఘటనలు లేకుండా ప్రశాంతంగా సాగింది. తుది ఫలితాలు రావడానికి అర్ద రాత్రి కావచ్చు
