HomePOLITICAL NEWSArmoorతృటిలో తప్పిన ప్రాణ ప్రమాదం - ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి రైలింగ్ ఢీకొన్న బస్సు...

తృటిలో తప్పిన ప్రాణ ప్రమాదం – ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి రైలింగ్ ఢీకొన్న బస్సు – మోర్తాడ్ మండలం గాండ్ల పెట్ బ్రిడ్జి వద్ద ఘటన – ఊపిరి పిలుచుకున్న ప్రయాణికులు

ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి ఆర్టీసీ బస్సు బ్రిడ్జి రైలింగును ఢీకొనడంతో తృటిలో ప్రాణం ప్రమాదం తప్పింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేట్ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది.

కరీంనగర్ నుండి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఎదురుగా మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చింది. డ్రైవర్ చాకచక్యంతో అటు బస్సును ఢీకొనకుండా, ఇటు బోల్తా పడకుండా రైలింగ్ అంచున బస్సు ఆగింది.

దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ఆర్టిసి డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ఉండకపోయి ఉంటే పెద్దవాగు కింది భాగంలో బస్సు బోల్తా పడి ఉండేది.

సుమారు 15 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. మోర్తాడ్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments