Thursday, April 16, 2026
HomeTelanganakamareddyకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గవర్నర్ కోట లో ఎమ్మెల్సీ లుగా నామినేటెడ్ అయిన కోదండరాం...

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గవర్నర్ కోట లో ఎమ్మెల్సీ లుగా నామినేటెడ్ అయిన కోదండరాం అమీర్ అలీఖాన్‌ నియామకం చెల్లదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది .

వారి నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది. కాగా, వీరిద్దరూ తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియామకం అయిన విషయం తెలిసిందే. అయితే, వీరి నియామకం అక్రమంగా జరిగిందని.. విచారణ జరిపి నియామకాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టు, సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇవాళ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. వారి నియామకం చెల్లదని తీర్పును వెలువరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.


వివరాల్లోకి వెళితే.. 2023 ఆగస్టులో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. అయితే, అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పలు కారణంతో తిరస్కరించారు.

అనంతరం 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండారాం, అమీర్ అలీ ఖాన్‌లను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ చేసింది. వీరి నామినేషన్లను గవర్నర్ ఆమోదించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!