HomeTelanganaNizamabadసర్వాయి పాపన్నగౌడ్ ఘనంగా జయంతి వేడుకలు

సర్వాయి పాపన్నగౌడ్ ఘనంగా జయంతి వేడుకలు

సర్వాయి పాపన్నగౌడ్ ఘనంగా జయంతి వేడుకలు గౌడ కులస్తులు ఘనంగా నిర్వహించారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ రెండవ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, పోరాట యోధుడు పాపన్నగౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

అన్యాయాన్ని ఎదురించేందుకు సర్వాయి పాపన్న గౌడ్ కనబర్చిన పోరాట తెగువ ఎంతో ప్రశంసనీయమైనదని కొనియాడారు. దౌర్జన్యాలు, అణిచివేతలకు వ్యతిరేకంగా సమర శంఖం పూరించిన సర్వాయి పాపన్న అని గుర్తు చేశారు.

పాపన్న గౌడ్ పోరాట పటిమ మార్చి పోలేనిదని గుర్తు చేశారు, ఈ కార్యక్రమంలో శ్రీహరి గౌడ్, జయసింహ గౌడ్ , గంగాధర్ గౌడ్ ,అంజగౌడ్, సుమన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments