ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో ఎస్సారెస్పీ అధికారులు గోదావరి నదిలోనికి ఎనిమిది గేట్లను ఎత్తివేశారు.
గత వారం రోజులుగా నిజామాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. మరోవైపు నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు కూడా ఆ నీరు సైతం గోదావరి నది ద్వారా ప్రాజెక్టులోకి వచ్చి చేరింది.
దీంతో ప్రాజెక్ట్ అధికారులు గేట్లు ఎత్తివేసి గోదావరి నదిలోకి నీటిని వదులుతున్నారు. ఇదిలా ఉండగా గత నిన్నటి రోజు వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు సూచించారు.
జాలర్లు చేపల వేటకు వెళ్ళవద్దని వివరించారు. ప్రాజెక్టు మొత్తం అడుగులు 1091 కాగా,, ప్రస్తుతం 1087 అడుగుల మీరు వచ్చి చేరింది . దీంతో ఎనిమిది గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోనికి వదిలుతున్నారు
