పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ఏట్టకేలకు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. జూబ్లీహిల్స్ హీట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2022 మార్చి 17న జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో రోడ్డు ప్రమాదం కేసులో రాహెల్ నిందితుడిగా ఉన్నాడు. ప్రమాదం జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. కోర్టు ఆదేశాలతో జూబ్లీహిల్స్ పీఎస్‌లో రహీల్ లొంగిపోయాడు.
