శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో విషాదం చోటు చేసుకుంది హైదరాబాద్ ఉప్పల్ లో ఆదివారం జరిగిన శ్రీకృష్ణ శోభాయాత్ర ముగింపు సమయంలో ఈ ఘటన జరిగింది
రథాన్ని తీసుకెళ్లే వెహికిల్ ఆగిపోవడంతో, ఓ పది మంది భక్తులు రథాన్ని నెడుతున్న క్రమంలో రథం పైన ఉన్న విద్యుత్ తీగలు రథానికి తాకడంతో ఒక్కసారిగా అలజడి రేగింది.కరెంట్ షాక్ ఆ పది మంది గట్టిగా విసిరేసినట్లుగా దూరంగా ఎగిరి పడ్డారు.
తీవ్రంగా గాయపడ్డ వారిని ఆసుపత్రి కి తరలించారు అక్కడే అయిదు గురు మృతి చెందారు ఆ ఐదుగురు మృతదేహాలను మాట్రిక్స్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురీకి తరలించార్గాయాలైనా వారిలో ఒకరు మాట్రిక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా, మరొకరు నాంపల్లి లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తుంది.
మరో ఇద్దరు స్థానికంగా చికిత్స పొందుతున్నారు మృతుల వివరాలు కృష్ణ అలియాస్ డైమండ్ యాదవ్(21 ఓల్డ్ రామంతపూర్), శ్రీకాంత్ రెడ్డి(35), సురేష్ యాదవ్(34 ఓల్డ్ రామంతపూర్), రుద్ర వికాస్(39 పద్మశాలి), రాజేంద్ర రెడ్డి(45)…లున్నారు .కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు …..
