స్కూటీని వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొని ఇంటర్మీడియట్ విద్యార్థిని మృతి చెందిన ఘటన ఘట్కేసర్ లో జరిగింది.వారాసిగూడకు చెందిన సురేష్ (38), భార్య ఉమ, కుమార్తె శ్రావణి(17)తో స్కూటి( టీజీ 10 ఎఫ్ 2209) పై వారి సొంత గ్రామానికి ( వరంగల్ జిల్లా సిరిపల్లె) శనివారం ఉదయం బయలుదేరారు.
ఘట్కేసర్ బైపాస్ రోడ్డు పక్కన వందన హోటల్ సమీపంలోకి రాగానే వెనుక నుంచి లారీ (టీజీ 07 యు 2133) ఢీకొని స్కూటీ వెనుక కూర్చున్న శ్రావణి కింద పడిపోగా ఆమె తలపై పైనుంచి లారీ వెళ్లి అక్కడికక్కడే మృతి చెందింది.
ఉమకు చేతికి బలమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి క్షత్రగాత్రులను ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతురాలు ఇంటర్ విద్యార్థి
