HomeCRIMEఆలయంలో అమానుషం.. మైనర్‌పై అర్చకుడి లైంగిక దాడి

ఆలయంలో అమానుషం.. మైనర్‌పై అర్చకుడి లైంగిక దాడి

రామచంద్రాపురంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆలయానికి బయట నుంచి తాళం వేసి లోపల ఓ మైనర్ బాలికపై అర్చకుడు సాయన్న లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి.

బాలికతో అర్చకుడు అసభ్యంగా ప్రవర్తిస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అర్చకుడిని అదుపులోకి తీసుకున్నారు.

బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments