Saturday, April 18, 2026
HomeLaw and Orderఖలీల్ వాడి లో నేటి నుంచి వన్ వే అమలు ...డాక్టర్ లతో సమావేశం నిర్వహించిన...

ఖలీల్ వాడి లో నేటి నుంచి వన్ వే అమలు …డాక్టర్ లతో సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ ఖలీల్ వాడి లో ట్రాఫిక్ , రాంగ్ పార్కింగ్, సెల్లార్ పార్కింగ్ చర్చ..భవిష్యత్తులో రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పార్కింగ్..త్వరలో సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు

నిజామాబాద్ నగరంలో ఖలీల్ వాడిలో ట్రాఫిక్ సమస్య ను అధిగమించడానికి ఉన్నపలంగా వన్ వే ను అమల్లోకి తెస్తున్నట్లు కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేసారు. బుధవారం కమాండ్ కంట్రోల్ లో ఆయన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు.

ఖలీల్ వాడి లో ట్రాఫిక్ రాంగ్ పార్కింగ్, సెల్లార్ పార్కింగ్ వంటి అంశాలను ప్రస్తావించారు ప్రతి హాస్పటల్ సంబంధించిన వారు వారి పరిధిలో ఉన్నటువంటి మెడికల్స్ , పార్కింగ్ స్థలాలు , ఫుట్ పథ్ , ఎంక్రోచ్మెంట్లు ( ఆక్రమణలు ) అంబులెన్స్ గురించి సంబంధిత డాక్టర్ల సూచనలు మరియు సలహాల మేరకు విని , భవిష్యత్తులో వాటి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం క్షుణ్ణంగా తెలియజేశారుజిల్లాలోని అన్ని శాఖలను సమన్వయం పరుచుకుంటూ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని

ఈ కౌన్సిల్ భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలపై తక్షణ పర్యవేక్షణ చేసి వాటి నివారణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

రాజీవ్ గాంధీ ఆడిటోరియం పేడ్ పార్కింగ్ గా ఏర్పాటు అంశం ప్రతిపాదనలో ఉందన్నారు ఈ సౌకర్యాన్ని హాస్పిటల్స్ కు వచ్చేటటువంటి పేషెంట్లు మరియు వారి బంధువులు కు తెలియజేయాలన్నారు .

ప్రతి ఒక్కరూ ప్రభుత్వ మెడికల్ గైడ్లైన్స్ తూ . చా తప్పనిసరిగా పాటించాలని ఇట్టి సూచనలు ఎవరైనా పాటించని యెడల వారిపై ప్రభుత్వపరంగా గల జరిమానాలు లైసెన్సుల రద్దు చేయడం జరుగుతుందని తెలియజేశారు.

అదనపు పోలీస్ కమిషనర్ ( అడ్మిన్ ) బస్వా రెడ్డి , డిఎం అండ్ హెచ్ ఓ శ్రీమతి రాజశ్రీ , అదనపు మునిసిపల్ కమిషనర్ రవి , ఐఎంఏ ప్రెసిడెంట్ అజె శ్రీనివాస్ , నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ మరియు ఐఎంఏ సంబంధించిన డాక్టర్లు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!