నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థులు . ఎంబీబీఎస్ న విద్యార్థిపై మీద చేయి చేసుకోవడం కలకలం రేపింది.చివరికి ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది .
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన రాహుల్ నిజామాబాద్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.
ఇంటర్నల్ డ్యూటీలో భాగంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నాడు.అయినా విధులకు గైర్హాజరైనట్లు గా రికార్డ్ ల్లో నమోదు అయింది.
ఈ విషయమై రాహుల్ శనివారం పీజీ సీనియర్ల వద్దకు వెళ్లి అడిగాడు. తాను డ్యూటీ చేసినా కూడా.. ఎలా గైర్హాజరు వేశారని అడిగాడు.
దీంతో మమ్మల్నే నిలదీస్తావా.. అంటూ సీనియర్లు రాహుల్ మీద మీద చెయ్యి చేసుకున్నారు.విద్యార్థుల మధ్య జరిగిన గొడవ లో లోపల సర్దు బాటు చెయ్యడానికి మెడికల్ కాలేజీ అధికారులు ట్రై చేశారు
